: ముగిసిన సీడబ్ల్యూసీ సమావేశం


ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. శుక్రవారం జరుగనున్న ఏఐసీసీ సమావేశంలో ప్రవేశపెట్టే తీర్మానాలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని పలువురు సభ్యులు ఈ సమావేశంలో పట్టుబట్టినట్టు తెలిసింది. అయితే, దీనికి ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అంగీకరించలేదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీకి ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. దీంతో యువనేత రాహుల్, 2014 ఎన్నికల ప్రచార కమిటీకి సారధిగా వ్యవహరించేందుకు మార్గం సుగమం అయింది.

  • Loading...

More Telugu News