: 'తెలుగు వారియర్స్' కు కెప్టెన్, వైస్ కెప్టెన్లుగా వెంకటేశ్, అఖిల్


ప్రతి ఏడాది జరిగే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కు మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 25 నుంచి సీసీఎల్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది 'తెలుగు వారియర్స్' జట్టుకు కెప్టెన్ గా వెంకటేశ్, వైస్ కెప్టెన్ గా అక్కినేని అఖిల్ వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే పలుసార్లు క్రికెట్ ఆడి తన ప్రతిభను కనబర్చిన అఖిల్.. ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు. దాంతో, అతనిని వైస్ కెప్టెన్ గా నియమించినట్లు తెలుగు వారియర్స్ తెలిపింది. అఖిల్ ద్వారా జట్టుకు మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తోంది.

  • Loading...

More Telugu News