: హైదరాబాదులో విశ్వహిందూ పరిషత్, ఏబీవీపీ కార్యకర్తల మౌన ప్రదర్శన
హైదరాబాదు వనస్థలిపురంలోని పనామా సెంటర్ లో ఇవాళ ఏబీవీపీ, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు మౌన ప్రదర్శన నిర్వహించారు. తిరుమలలో అరెస్ట్ చేసిన భక్తులను విడుదల చేయాలని, వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమైన టీటీడీ ఛైర్మన్, ఈవోలను తక్షణమే తొలగించాలని వారు నిరసన వ్యక్తం చేశారు.