: నాకు దావూద్ గ్యాంగ్ తో సంబంధాలు లేవు: అజయ్
తిరుమల శ్రీవారి దర్శనానికి దావూద్ తో సంబంధాలు కలిగినవారు వచ్చారనే వ్యాఖ్యలతో టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు మరో సంచలనానికి తెరతీశారు. వీఐపీ కేటగిరీలో విచ్చేసిన వీరికి టీటీడీ అధికారులు సకల మర్యాదలు చేశారని ఆయన ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలను సదరు వ్యక్తి అజయ్ నావన్ దార్ ఖండించారు. తాను తిరుమలకు మొదటి సారి ఓ మంత్రితో వచ్చానని, రెండోసారి రాజ్ థాకరేతో వచ్చానని చెప్పారు. తనకు, తనతో పాటు వచ్చిన వారికి దావూద్ గ్యాంగ్ తో సంబంధాలు లేవని స్పష్టం చేశారు. తనపై పోలీసు కేసులు కూడా లేవని తెలిపారు. తనపై ఆరోపణలు చేసినవారికి కోర్టు నోటీసులు పంపుతానని చెప్పారు.