: ఆరుగురు సీమాంధ్ర ఎంపీలకు అందని ఏఐసీసీ ఆహ్వానం
రేపు జరగనున్న కీలక ఏఐసీసీ సదస్సుకు సీమాంధ్రకు చెందిన ఆరుగురు సీమాంధ్ర ఎంపీలకు ఆహ్వానం అందలేదు. వీరిలో లగడపాటి, రాయపాటి, సబ్బం హరి, ఉండవల్లి, హర్షకుమార్, సాయిప్రతాప్ లు ఉన్నారు. వీరంతా మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఏకంగా కాంగ్రెస్ అధిష్ఠానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. వీరిని సదస్సుకు ఆహ్వానిస్తే సమైక్యాంధ్ర కోసం పట్టుబడుతూ, సమావేశాల్లో ఆందోళనకు దిగే అవకాశం ఉందన్న అనుమానంతోనే పాసులు నిరాకరిస్తున్నట్టు సమాచారం. అయితే వీరంతా పాసుల కోసం పట్టుబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.