: మార్కెట్లోకి సరికొత్త హెచ్.పి. వాయిస్ ట్యాబ్లెట్


మొబైల్ ఫోన్ల మార్కెట్ భారత్ లో వేగంగా విస్తరిస్తోన్న విషయం తెలిసిందే. ఇదే అదనుగా భావించిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హ్యూలెట్ ప్యాకర్డ్ (హెచ్.పి) సరికొత్త ఫీచర్లతో వాయిస్ ట్యాబ్లెట్ ను రూపొందించింది. వచ్చే నెలలో భారత్ మార్కెట్లోకి విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. హెచ్.పి. స్లేట్ 6, హెచ్.పి. స్లేట్ 7 పేర్లతో ఈ ట్యాబ్స్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, పవర్ ఫుల్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తాయి. మల్టీ టాస్కింగ్ ని కోరుకొనే వినియోగదారులను ఈ ట్యాబ్స్ తప్పక అలరిస్తాయని సంస్థ తెలిపింది. 3జీ డ్యూయల్ సిమ్, వాయిస్ కనెక్టివిటీ, ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాలు ఈ ట్యాబ్స్ కు స్పెషల్ ఫీచర్స్.

  • Loading...

More Telugu News