: భారత్ కు మారనున్న వరల్డ్ కప్ టీ20?


ప్రపంచ ఐసీసీ టీ20 సమరవేదిక బంగ్లాదేశ్ నుంచి భారత్ కు మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. బంగ్లాదేశ్ లో ఇటీవల జరిగిన జాతీయ ఎన్నికలు హింసాత్మకంగా మారడం తెలిసిందే. విపక్షాలన్నీ ఎన్నికలను బహిష్కరించాయి. రాజకీయ గందరగోళం నేపథ్యంలో అక్కడి తాజా పరిస్థితులను ఐసీసీ పరిశీలిస్తోంది. వచ్చే వారం ఢాకాలో భద్రతా సమీక్ష జరగనుంది. అనంతరం వేదిక మార్చే విషయమై ఐసీసీ ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్ కు వచ్చే విషయమై వెస్టిండీస్, పాకిస్థాన్ జట్లు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశాయి. గత డిసెంబర్ లో వెస్టిండీస్ టీమ్ బస చేసిన ఢాకాలోని హోటల్ ముందు బాంబుదాడి జరగడం కూడా ఆందోళనకు కారణం. ఇక శ్రీలంక కూడా సిల్హెట్ వేదికగా మ్యాచ్ ఆడేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో టీ20 కప్ భారత్ కు మార్చే అవకాశాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News