: ఏఏపీలో ముసలం.. కేజ్రీవాల్ పై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే బిన్నీ


ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసి కొన్ని రోజులు కూడా గడవకుండానే ఏఏపీలో ముసలం పుట్టింది. ఏఏపీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై ఆ పార్టీ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ చెప్పిందొకటి... చేస్తున్నది మరొకటని ఆరోపించారు. మేనిఫెస్టోలో ఉంచిన హామీలను కేజ్రీవాల్ పట్టించుకోవడం లేదని.. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేజ్రీ పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ఈ రోజు ఢిల్లీలో బిన్నీ ప్రెస్ మీట్ పెట్టి కేజ్రీవాల్ ను తూర్పారబట్టారు.

అవినీతి వ్యతిరేక ఉద్యమంతోనే ఏఏపీ ఏర్పడిందని... ఎవరినో ఎమ్మెల్యేలు, ఎంపీలను చేయడానికి ఏఏపీ ఏర్పడలేదని బిన్నీ ఎద్దేవా చేశారు. విద్యుత్, తాగునీటికి సంబంధించిన హామీలను పూర్తిగా నెరవేర్చలేకపోయారని విమర్శించారు. కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సంక్షేమాన్ని కేజ్రీవాల్ గాలికొదిలేశారని ఆరోపించారు. పబ్లిసిటీ కోసం ఏఏపీ ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు. డెన్మార్క్ మహిళపై అత్యాచారం ఘటనపై కేజ్రీ ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు స్పందించలేదని బిన్నీ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News