: టీటీడీ ఛైర్మన్ కనుమూరిని వెంటనే తప్పించండి: హీరో శివాజీ
భక్తుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోని టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజును పదవి నుంచి సాగనంపాలని సినీ హీరో శివాజీ డిమాండ్ చేశారు. వీఐపీలకు రెడ్ కార్పెట్ పరుస్తూ, భక్తులను ఇబ్బందులకు గురిచేసిన టీటీడీ ఛైర్మన్, ఈవోలపై పోలీసు కేసులు పెట్టాలని కోరారు. దీనికి సంబంధించి ఆయన ఈ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లిబర్టీ సమీపంలో ఉన్న టీటీడీ కళ్యాణమండపం దగ్గర ప్రెస్ మీట్ పెట్టనున్నారు.