: ఆరు కిలోల బంగారం పట్టివేత
దుబాయ్ విమానాశ్రయ అధికారుల కళ్లు గప్పిన వ్యక్తి దగ్గర ఆరు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు కనిపెట్టేసి.. పట్టేశారు. ఖాట్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుడు దిగిన తరువాత కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తుండగా ఒక్కోటి కిలో బరువున్న ఆరు బంగారు కడ్డీలు బయటపడ్డాయి. నడుంనొప్పికి ఉపయోగించే బెల్టులో ఈ బంగారు కడ్డీలను దాచి ఉంచినట్టు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. దాంతో పాటు 15,500 దిర్హామ్ ల సౌదీ అరేబియా కరెన్సీ కూడా స్వాధీనం చేసుకొన్నట్లు అధికారులు తెలిపారు. మహ్మద్ సనుద్ (22) అనే కేరళవాసి దుబాయ్ విమానంలో బయల్దేరి నేపాల్ రాజధాని ఖాట్మాండుకి చేరినప్పుడు ఈ ఘటన చోటు చేసుకొంది.