: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మాతృ వియోగం
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తల్లి హైమావతమ్మ కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హైమావతమ్మ(80) పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారుజామున ప్రాణం విడిచారు. ఈ రోజు సాయంత్రం నెల్లూరు సమీపంలోని అల్లీపురంలో అంత్యక్రియలు జరుగుతాయి.