: రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేరళ రాష్ట్రానికి చెందిన ఎన్సీపీ నేత ముజిబ్ రెహ్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ నిన్న కేరళలోని అలప్పుజా జిల్లా నూరానాద్ ప్రాంతంలో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే, ఈ సందర్భంగా రాహుల్ గాంధీ పోలీసు వాహనంపైకెక్కి పర్యటించడం ద్వారా.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ట్రాఫిక్ జామ్ కు కారణమయ్యారని, మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 123ని ఉల్లంఘించారని రెహ్మాన్ నూరానాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు మాత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ప్రాథమిక సాక్ష్యాధారాల ప్రకారం రాహుల్ ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని తెలిపారు. మరి పోలీసు వాహన దుర్వినియోగంపై స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.