: బిల్లును తగలేస్తే తప్పేంటి?: గంటా


సీమాంధ్ర ప్రజలు వ్యతిరేకిస్తున్న తెలంగాణ బిల్లును భోగి మంటల్లో తగలేస్తే తప్పేమిటని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై మహామహుల విగ్రహాలను ధ్వంసం చేసినప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక్క నాయకుడైనా స్పందించారా? అని ప్రశ్నించారు. అప్పుడు రాని కోపం ఇప్పుడెందుకని నిలదీశారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ విశాఖ కలెక్టరేట్ వద్ద సమైక్య జేఏసీ నేతలు టీబిల్లు ప్రతులను భోగిమంటల్లో దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంటా, విప్ ద్రోణంరాజు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పంచకర్ల రమేష్ బాబు, చింతలపూడి వెంకట్రామయ్య పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News