: ప్రభుత్వ భూముల కబ్జాలపై జేపీ సత్యాగ్రహ దీక్ష


రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ప్రభుత్వ భూముల కబ్జాలపై లోక్ సత్తా పోరాటాన్ని కొనసాగిస్తోంది. హఫీజ్ పేట గోకుల్ ఫ్లాట్స్ లో అక్రమాలకు, ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న లోక్ సత్తా నేతలపై కేసులు పెట్టడాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ (జేపీ) ఖండించారు. పార్టీ నేతలపై కేసులకు నిరసనగా ఇవాళ (మంగళవారం) జేపీ మౌన సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్షా శిబిరానికి ఎమ్మెల్సీ నాగేశ్వర్ హాజరై తన సంఘీభావాన్ని ప్రకటించారు. మౌన దీక్ష అనంతరం జేపీ మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ రహదారికి అడ్డంగా ప్రహారి గోడ నిర్మించడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజల రాకపోకలకు, వాహనదారులకు ఇబ్బందులు గురిచేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎన్ని కేసులు పెట్టినా వెనుతిరుగేది లేదని.. తమ పోరాటాన్ని కొనసాగించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News