: సభను ఈటెల తప్పుదోవ పట్టించారు: ధూళిపాళ్ల


అసెంబ్లీలో టీబిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ అన్నీ అబద్దాలే చెప్పారని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్మాణంపై ఈటెల మాట్లాడుతూ నిజాలన్నింటినీ వక్రీకరించారని విమర్శించారు. తెలంగాణకు నీరు రాకుండా అడ్డుపడుతూ, పొరుగు రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఈటెల ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇది టీఆర్ఎస్ ద్వంద్వ నీతికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఈ రోజు హైదరాబాదులో ధూళిపాళ్ల మీడియాతో మాట్లాడారు.

  • Loading...

More Telugu News