: ఆర్టీఏ అధికారిపై దాడికి ట్రావెల్స్ యజమానుల యత్నం
ఆర్టీఏకు చెందిన ఉప కమిషనర్ శివరాంప్రసాద్ పై ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు కర్నూలులో దాడికి యత్నించారు. దీంతో జిల్లా ఎస్పీకి ఆయన ఫిర్యాదు చేశారు. రవాణా శాఖాధికారులు కర్నూలు టోల్ గేట్ సమీపంలో ఈ రోజు ఉదయం తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 9 బస్సులను సీజ్ చేసిన సంగతి తెలిసిందే.