: ఖరారైన గవర్నర్ చిత్తూరు జిల్లా పర్యటన
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చిత్తూరు జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 12.40 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరి తిరుపతి చేరుకుంటారు. అక్కడ నుంచి తిరుపతి పద్మావతి అతిథి గృహానికి వెళతారు. సాయంత్రం తిరుచానూరు వెళ్లి అమ్మవారిని దర్శించుకుని... అక్కడి నుంచి తిరుమల వెళతారు. మరుసటి రోజు (16వ తేదీ) మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుమల నుంచి బయలుదేరి, తిరుపతి విమానాశ్రయం చేరుకుని అక్కడనుంచి హైదరాబాద్ బయలుదేరుతారు.