: ఏఏపీ నేత వాహనశ్రేణిపై రాళ్ల దాడి
ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ బిశ్వాన్ వాహనశ్రేణిపై దుండగులు రాళ్లదాడికి పాల్పడ్డారు. 2014 లోక్ సభ ఎన్నికలకు యూపీలో ఏఏపీని సమాయత్తం చేయడానికి ఆయన ఈ రోజు అమేథీలో 'జన్ విశ్వాస్ ర్యాలీ'ని చేపట్టారు. తమ పోరాటం రాచరికం, అవినీతిపైనే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తాను సామాన్యుడినైతే, అమేథీ నుంచి పోటీ చేసే రాహుల్ గాంధీ యువరాజు అంటూ విమర్శించారు. తమకు గెలుపు, ఓటమిలు ముఖ్యం కాదని... వ్యవస్థలో నెలకొన్న అసాంఘిక పరిణామాలను పెకిలించడమే లక్ష్యమని బిశ్వాన్ చెప్పారు. మరో విషయం ఏమిటంటే, అమేథీలో బిశ్వాన్ కు నల్ల జెండాలు స్వాగతం పలికాయి.