: హీరో కావాలనుకుంటున్న కిరణ్ జీరో అవుతారు: వీహెచ్


రాష్ట్ర విభజనను అడ్డుకుని సీమాంధ్ర ప్రాంతంలో సీఎం కిరణ్ హీరో కావాలనుకుంటున్నారని... కానీ, ఆయన జీరో అవుతారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. కిరణ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ఏర్పాటును ఆపలేరని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మకు తెలంగాణ ప్రజలందరూ రుణపడి ఉంటారని చెప్పారు. ఈ రుణాన్ని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తీర్చుకుంటారని తెలిపారు. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలంగాణ ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారని అన్నారు. నిజామాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News