: ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచేందుకే సీమాంధ్ర బంద్: అశోక్ బాబు


సమైక్య రాష్ట్రం కోసం ఎంతవరకు పోరాడటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచేందుకే ఈ నెల 17, 18న సీమాంధ్ర బంద్ కు పిలుపునిచ్చామని స్పష్టం చేశారు. విభజన బిల్లు అనేది సీమాంధ్రులకు మరణశాసనం లాంటిదని చెప్పారు. రేపు ఒంగోలులో టీబిల్లును భోగి మంటల్లో తగులబెడతామని తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమ తీవ్రత ప్రతి ఒక్కరికీ తెలిసేలా చేస్తామని అన్నారు. తెలంగాణ నాయకుల్లో ఉన్న ఐకమత్యం సీమాంధ్రలో లేదని అంటున్నారని... ఇది తప్పని నిరూపించడానికి అన్ని పార్టీలు కలసి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీలో అన్ని పార్టీలు విభజన బిల్లుపై చర్చించి, అభిప్రాయాలు తెలపాలని... చివరగా బిల్లును ఓడించాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రులను కించపరిచేలా కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అశోక్ బాబు తెలిపారు.

  • Loading...

More Telugu News