: రాంచరణ్ సినిమాను అడ్డుకుంటాం: టీఆర్ఎస్
తెలంగాణకు వ్యతిరేకి అయిన చిరంజీవి కుమారుడు రాంచరణ్ సినిమా 'ఎవడు'ని మెదక్ జిల్లాలో ప్రదర్శించకుండా అడ్డుకుంటామని టీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. టీఆర్ఎస్ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి జీవన్ రావు, మోచి కిషన్, శ్రీకాంత్ తదితరులు మెదక్ లో మాట్లాడారు. తెలంగాణ వ్యతిరేకులైనవారి సినిమాలను ఈ ప్రాంతంలో ఆడనీయబోమని హెచ్చరించారు.