: దూసుకెళ్లిన లారీ.. ఐదు వేల కోళ్లు మృతి
అదుపుతప్పిన లారీ కోళ్లఫారంలోకి దూసుకెళడంతో, దాదాపు ఐదు వేల కోళ్లు మృతి చెందాయి. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలోని 16వ నంబరు జాతీయ రహదారిపై జరిగింది. విజయవాడ నుంచి కాకినాడకు బియ్యం లోడుతో వెళుతున్న లారీ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ స్పల్ప గాయాలతో బయటపడ్డాడు. దాదాపు రూ. 5 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది.