: ఆకారం చిన్నదే అయినా అధిక శక్తి గలది ద్రాక్ష


ద్రాక్ష పండ్లు ఆకారం చిన్నగా ఉంటాయి. కానీ వాటివల్ల తక్షణం మన శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. మనకు మార్కెట్లో రకరకాల రంగుల్లో నోరూరించేలా కనిపించే ద్రాక్ష పండ్ల వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఈ పండ్లను తరచూ తినడం వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్‌ ఎ, విటమిన్‌ సి, విటమిన్‌ బి6 లాంటి వాటితోబాటు ఫొలేట్‌, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సెలీనియం వంటి పోషకాలు కూడా ద్రాక్షలో మనకు లభిస్తాయి. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లుగా పరిగణించే ఫ్లేవనాయిడ్లు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆరోగ్యానికి హానికరమైన ఫ్రీరాడికల్స్ ను దూరం చేసి, చర్మం తాజాగా ఉండేందుకు ఉపకరిస్తాయి.

అధికంగా ద్రాక్ష పండ్లను తినడం వల్ల మలబద్దకం సమస్యను నివారించవచ్చు. అలాగే అజీర్తి, అలసట, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు, కంటిచూపు మందగించడం వంటివి కూడా తగ్గుతాయి. కండరాలు బలంగా, దృఢంగా ఉంటాయి. పరిశోధకుల అధ్యయనాలను పరిశీలించితే ద్రాక్ష రసం తాగడం వల్ల రొమ్ము క్యాన్సర్‌ ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు... బాగా నీరసంగా ఉన్న సమయంలో తక్షణ శక్తికోసం ద్రాక్షరసం తాగితే మంచి ఫలితం ఉంటుంది. పచ్చి ద్రాక్షే కాకుండా ఎండు ద్రాక్ష వల్ల కూడా ఇలాంటి ఫలితాలను మనం పొందవచ్చు. కాబట్టి మనతోబాటు కాసిన్ని ఎండుద్రాక్షను కూడా తీసుకెళ్లి తీరిక వేళల్లో తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, శక్తిని కూడా పొందవచ్చు!

  • Loading...

More Telugu News