: ఫిబ్రవరిలో బిల్లుకు పార్లమెంటు ఆమోదం: మధుయాష్కీ
ఆర్టికల్-3ని తొలగించాలనుకోవడం సాక్షాత్తూ అంబేద్కర్ ని అవమానపరచినట్టేనని కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయినట్టేనని ఆయన తెలిపారు. ఫిబ్రవరిలో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ రోజు హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ విధంగా స్పందించారు.