: బీజేపీతో బంధం దిశగా ఎండీఎంకే అడుగులు
తమిళనాడులో వైగో నేతృత్వంలోని ఎండీఎంకే పార్టీ రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది. ఈ అంశంపై బీజేపీతో చర్చలు జరిపేందుకు నలుగురు సభ్యులతో ఈ రోజు ఒక కమిటీని వైగో ప్రకటించారు. మసిలమణి, గణేశ్ మూర్తి, ఇమయం జేబ్ రాజ్, సెవంతియప్పం ఈ కమిటీలో సభ్యులు.