: హెల్మెట్ తో స్కూటర్ పై రాత్రివేళ తిరుగుతున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు


రాత్రి వేళల్లో స్కూటర్ పై వెళ్లాల్సినంత అవసరం ఫ్రాన్స్ అధ్యక్షుడు హాలండే(59)కు ఏం వచ్చింది? అన్న సందేహం రాకమానదు. ప్రియురాలి కోసం పాట్లు అలానే ఉంటాయి. బయటకు తెలియకూడదనే ఉద్దేశంతో ఆయనిలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. పారిస్ లో జూలీ గాలియెట్(41) అనే నటీమణితో హాలండే సాగిస్తున్న రహస్య లవ్ స్టోరీని క్లోజర్ పత్రిక బయటపెట్టింది. ముందు హాలండే వ్యక్తిగత రక్షకుడు నటీమణి ఉండే అపార్ట్ మెంట్ వద్దకు వచ్చి తనిఖీ చేయడం.. ఆ తర్వాత హాలండే స్కూటర్ పై వచ్చి నటి ఇంట్లోకి దూరే సన్నివేశాలను ఆ పత్రిక ప్రచురించింది. దీనిపై హాలండే మండిపడ్డారు. తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించిన పత్రికపై చర్య తీసుకుంటానని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News