: సర్దిచెప్పాల్సిన డిప్యూటీ స్పీకర్.. మిన్నకుండిపోయారు: గాదె


చిన్న రాష్టాల కోసం పొట్టి శ్రీరాములు దీక్ష చేపట్టారని అసెంబ్లీలో టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ చరిత్రను వక్రీకరిస్తుంటే... కాంగ్రెస్ నేత ద్రోణంరాజు అడ్డుకునే ప్రయత్నం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి చెప్పారు. ఈ మాత్రం దానికి మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ద్రోణంరాజు వద్దకు దూసుకొచ్చారని అన్నారు. తాను మధ్యలో సర్దిచెప్పడానికి ప్రయత్నిస్తుంటే తన భుజం మీద చేయి వేశారని చెప్పారు. అయితే అప్పుడు సభాపతి సీట్లో కూర్చున్న డిప్యూటీ స్పీకర్ దానిపై వెంటనే స్పందించాల్పింది పోయి... చూస్తూ ఉండిపోయారని అన్నారు. ఈ వివరాలను గాదె ఓ టీవీ వార్తా చానల్ కార్యక్రమంలో వివరించారు.

  • Loading...

More Telugu News