: స్వదేశానికి తిరిగొచ్చిన దౌత్యాధికారిణి దేవయాని
భారత దౌత్యాధికారిణి దేవయాని స్వదేశానికి తిరిగొచ్చారు. అమెరికాలో ఆమె ఎదుర్కొంటున్న ఆరోపణలపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. అయినప్పటికీ దేవయానిని తిరిగి వెళ్లమని అమెరికా ప్రభుత్వం కోరింది. దాంతో, ఆమె రాగానే అదే హోదాలో ఢిల్లీ ఎంబసీలో పని చేస్తున్న అమెరికా అధికారిని స్వదేశానికి వెళ్లిపొమ్మని భారత్ కోరింది.