: వైకుంఠ దర్శనానికి తిరుమలకు పోటెత్తిన భక్తులు


రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే లక్ష మందికి పైగా భక్తులు తిరుమల చేరుకోగా, అటు మూడు కిలోమీటర్లకు పైగా సర్వదర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఇక ఇప్పటికే తిరుమలకు 80 మందికిపైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకున్నారు. మరోవైపు దివ్యదర్శనం టికెట్లు జారీచేసే కౌంటర్ వద్ద భక్తులు తోసుకుంటున్నారు. అటు కాలినడక భక్తులకు ఇప్పటికే టీటీడీ పాలకమండలి 30వేలకు పైగా టోకెన్లు జారీ చేసింది.

  • Loading...

More Telugu News