: టీఆర్ఎస్ నేత హరీష్ రావుపై కేసు నమోదు


ఓ పోలీస్ కానిస్టేబుల్ ని వినలేనటువంటి భాషలో తిట్టిపోసిన టీఆర్ఎస్ నేత హరీష్ రావుపై పోలీసు కేసు నమోదైంది. హైదరాబాద్ రాయదుర్గం పీఎస్ లో ఈ కేసును బుక్ చేశారు. హరీష్ రావుపై ఐపీసీ సెక్షన్ 353 (విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వోద్యోగిని ధూషించడం, దాడి చేయడం) కింద అభియోగాలు మోపారు. రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన హరీష్ రావును పోలీసులు బలవంతంగా పోలీస్ జీపులోకి ఎక్కించారు. ఈ సందర్భంగా నిగ్రహాన్ని కోల్పోయిన హరీష్ 'లం....కా' అంటూ బూతుపురాణం అందుకున్నారు. హరీష్ తిట్లు ఎలక్ట్రానిక్ మీడియా వీడియోల్లో కూడా రికార్డయ్యాయి.

  • Loading...

More Telugu News