: రాబర్ట్ వాద్రా కారును ఓవర్ టేక్ చేసిన వ్యాపారవేత్తకు జరిమానా!


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కారును ఓవర్ టేక్ చేసిన ఓ స్థానిక వ్యాపారవేత్తకు పోలీసులు జరిమానా విధించారు. ఓక్లా అనే ప్రాంతంలో వాద్రా కారులో వెళుతుండగా.. సౌరభ్ రస్తోగీ అనే వ్యాపారవేత్త లజ్ పత్ నగర్ లోని తన ఇంటినుంచి వస్తూ అదే ప్రాంతం నుంచి మోతీ మిల్స్ కు వెళుతున్నారు. ఈ సమయంలో వ్యాపారవేత్త చాలా తొందరగా వాద్రా కారును దాటుకుంటూ వెళ్లారు. ఆగ్నేయ ఢిల్లీలోని అమర్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనను వాద్రా రక్షణ సిబ్బంది ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు వ్యాపారవేత్తకు మోటార్ వెహికల్ చట్టంలోని సెక్షన్ 184 కింద కొంత మొత్తంలో చలానా విధించి పంపించారు.

  • Loading...

More Telugu News