: ఇది గాదెపై జరిగిన దాడి కాదు.. సమైక్యవాదం మీద దాడి: బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
కాంగ్రెస్ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు జరిపిన దాడి ఆయనపై జరిగినది కాదని... సమైక్యవాదం మీద జరిగిన దాడి అని టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. శాసనసభలో టీఆర్ఎస్ పార్టీ నేతలు ఘర్షణ వాతావరణాన్ని సృష్టించాలని కోరుకుంటున్నారని అన్నారు. సభలోనే కాదు, బయట మీడియా వారిలో కూడా తీవ్ర విభేదాలు ఉన్నాయని, మీరు తెలంగాణ వారా? ఆంధ్ర వారా? అనే వాదనలు వినిపిస్తున్నాయని... అటువంటి పరిస్థితుల్లో ఓటింగ్ నిర్వహించడమే సరైన పరిష్కారం అని ఆయన స్పష్టం చేశారు.