: మరో సుప్రీం న్యాయమూర్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలు
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గంగూలీ లైంగిక వేధింపుల ఉదంతం సమసిపోకముందే.. మరో ఘటన వెలుగు చూసింది. మరొక న్యాయ విద్యార్థిని కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి (గంగూలీ కాదు) చేతిలో లైంగిక వేధింపులకు గురైనట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ దినపత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. కోల్ కతాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యుడీషియల్ సైన్సెస్ కు చెందిన మాజీ న్యాయ విద్యార్థిని లోగడ ఇంటర్న్ షిప్ లో భాగంగా సుప్రీం న్యాయమూర్తి చేతిలో వేధింపులకు గురైందని.. జస్టిస్ గంగూలీ అంశంలో వచ్చిన స్పందన నేపథ్యంలో ఆమె కూడా ఫిర్యాదు చేయాలని అనుకుంటోందని ఆ కథనంలో పేర్కొంది.