: నాపై అభియోగాలు అవాస్తవమని నిరూపిస్తా: దేవయాని
తనపై అమెరికా మోపిన అభియోగాలు అవాస్తవమని.. అలా అని నిరూపిస్తానని భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగదె తెలిపారు. దౌత్యరక్షణ నడుమ భారత్ కు బదిలీ చేసిన నేపథ్యంలో ఆమె ఇలా ప్రకటించారు. ఈ కేసు ప్రభావం తన కుటుంబం, పిల్లలపై పడదని ఆమె అన్నారు. బదిలీ చేయడం, అమెరికా కోర్టులో విచారణ నిలిచిపోవడంతో ఆమె భారత్ కు తిరిగిరానున్నారు. ఢిల్లీలోని విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయంలో ఆమె రిపోర్టు చేయాల్సి ఉంటుంది.