: భూమిలాంటి గ్రహాలు బోలెడున్నాయట
మన భూమి లాంటి గ్రహాలు అంతరిక్షంలో ఉన్నాయా...? ఈ విషయంపై శాస్త్రవేత్తలు చాలాకాలంగా పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో భూమిని పోలిన గ్రహాలు మన పాలపుంతలో చాలానే ఉన్నాయని తేల్చారు. చక్కటి వాతావరణం, పుష్కలంగా నీరు కలిగి, జీవంతో కళకళలాడుతున్న భూమి, మొత్తం సౌరకుటుంబంలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఇలాంటి వాతావరణంతోనే ఉన్న గ్రహాలను సౌరకుటుంబంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. మన భూమికన్నా ఇవి పెద్ద గ్రహాలు కూడా! ఇలాంటి గ్రహాల తీరుతెన్నులను గురించి గతంలోనే శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే తాము అంచనా వేసిన స్థాయికన్నా కూడా మించిన స్థాయిలో సూపర్ ఎర్త్‌లలో భూమిని పోలిన వాతావరణం ఉండే అవకాశం ఉందని తాజాగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నార్త్ వెస్ట్రన్ వర్సిటీ, షికాగో విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలు తయారుచేసిన ఒక నమూనాలో ఈ మేరకు వెల్లడించారు.