: రాగితో రాత రాయవచ్చు


ఇంక్‌పెన్‌లో మామూలు ఇంక్‌ కాకుండా లోహపు ఇంక్‌ వేసి రాయగలిగితే కొత్తగా, తమాషాగా వుంటుంది కదూ? శాస్త్రవేత్తలు ఇలాంటి సరికొత్త లోహపు ఇంకును ఇప్పుడు ఆవిష్కరించారు. ఈ ఇంక్‌తో సరికొత్త ఆధునిక ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను ఆవిష్కరించడానికి మరింత సులభతరం అవుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ సిరాతో రాసినప్పుడు సాధారణ కాగితపు పుస్తకాల మాదిరిగానే అనుభూతి కలిగిస్తుందని, సూక్ష్మ రాగి పత్రాల ద్వారా రూపొందించిన లోహపు సిరాతో సాధారణ ప్రింటర్‌ కాగితంపై ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్‌ను రాసేందుకు వీలు కలుగుతుందని పరిశోధకులు 'ఏసీఎస్‌ అప్లైడ్‌ మెటీరియల్స్‌ అండ్‌ ఇంటర్‌ఫేసెస్‌' అనే పత్రికలో వివరించారు.

  • Loading...

More Telugu News