: ఆ వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పండి: సుప్రీంకోర్టు
22,885 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని సహారా సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. అక్రమాస్తుల కేసులో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. సహారా సంస్థ నిధుల సేకరణ వివరాలు వెల్లడించని పక్షంలో సీబీఐ, కంపెనీల రిజిస్ట్రారుల విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. న్యాయస్థానం నిస్సహాయంగా ఉందని అనుకోవద్దని, తమ హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవద్దని, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పకపోయినా.. విచారణ సంస్థల ద్వారా తాము తెలుసుకోగలమని కేఎస్ రాధాకృష్ణన్, జేఎస్ ఖేహార్ లతో కూడిన ధర్మాసనం హెచ్చరించింది.