: కారు డ్రైవర్ ను పెళ్లాడిన సినీనటి కవిత కూతురు


సినీనటి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు కవిత కుమార్తె మాధురి ఓ కారు డ్రైవర్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో వీరి ప్రేమ వివాహం జరిగింది. దళిత నేతల సమక్షంలో స్థానిక వెంకటేశ్వరాలయంలో వీరు ఒక్కటయ్యారు. దీనిపై మాధురి కుటుంబ సభ్యులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు మాధురిని వివాహ మాడిన ఆల్కపల్లి రాజ్ కుమార్ ను అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లారు. రాజ్ కుమార్ సికింద్రాబాద్ లో ప్రైవేటు కారు డ్రైవర్ గా పనిచేస్తుండగా, మాధురి ఎంఈడీ చదువుతున్నారు. వీరు గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారని సమాచారం. వీరి ప్రేమ వివాహానికి పెద్దలు అడ్డు చెప్పడంతోనే దేవాలయంలో పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News