: త్రిషకు అరెస్ట్ వారెంట్ జారీ


నటి త్రిషకు చెన్నై ఎగ్మోర్ కోర్టు మేజిస్ట్రేట్ అరెస్టు వారెంట్ జారీ చేశారు. గతంలో త్రిష నమోదు చేసిన కేసే ఇప్పుడు ఆమె మెడకు చుట్టుకుని, వారెంట్ ఇచ్చేంతవరకు తెచ్చింది. కేసు వేసి విచారణకు గైర్హాజరవుతున్న త్రిషపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. తమ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నట్లు భావించి వారెంట్ ఇచ్చింది. 2004లో ఓ మ్యాగజైన్ ప్రచురించిన తన ఫోటోలకు సంబంధించి త్రిష అప్పట్లో కేసు వేశారు. ఆ ఫోటోలు మార్ఫింగ్ చేసినవని ఆమె వాదించింది. ఇప్పటికీ ఈ కేసు కోర్టులో కొనసాగుతూనే ఉంది.

  • Loading...

More Telugu News