: హోటల్ కత్రియ సీజ్
హైదరాబాద్ సోమాజిగూడలోని త్రీస్టార్ హోటల్ కత్రియను హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీజ్ చేశారు. గత మూడేళ్లుగా ఈ హోటల్ ఆస్తి పన్ను చెల్లించక పోవడంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయి. దీనిపై పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ బకాయిలు చెల్లించకపోవడంతో హోటల్ ను సీజ్ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. గతంలో ఒకసారి ఈ హోటల్ ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు.