: ఎమ్మెల్యేల అరెస్టు సరికాదు: ధూళిపాళ్ల
శాసనసభ నుంచి సస్పెండైన 15 మంది వైఎస్సార్సీపీ శాసనసభ్యులను అరెస్టు చేయడం సరికాదని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. శాసనసభలో స్పీకర్ కు ఆయన విజ్ఞప్తి చేస్తూ సభ నుంచి వారిని సస్పెండ్ చేయడం సరైన నిర్ణయమైనా, చర్చ సందర్భంగా ప్రతి క్లాజుపైనా ఓటింగ్ జరిగే అవకాశం ఉందని, అలాంటప్పుడు ఓటింగ్ లో పాల్గొనే అవకాశం వారికి కల్పించాలని సూచించారు.