: భారత దౌత్యవేత్త దేవయానికి చుక్కెదురు


అమెరికాలో వీసా మోసం అభియోగాలను ఎదుర్కొంటున్న భారత దౌత్యవేత్త దేవయానికి స్థానిక కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ప్రాథమిక విచారణ గడువును పొడిగించాలని ఆమె కోరగా.. అందుకు న్యూయార్క్ కోర్టు నిరాకరించింది. దేవయానిపై సదరు కేసులో చార్జిషీటు దాఖలకు ఈ నెల 13 వరకు గడువు ఉంది. కేసు నమోదు చేసిన నెలరోజుల్లోగా ఈ పని చేయాల్సి ఉంటుంది. అనంతరం ఆమెపై కోర్టులో విచారణ ప్రారంభం అవుతుంది. వీసా మోసం కేసు పరిష్కారానికి తనకు, ప్రభుత్వానికి మధ్య చర్చలు జరుగుతున్నందున గడువు పొడిగించాలన్న ఆమె అభ్యర్థనను కోర్టు మన్నించలేదు.

  • Loading...

More Telugu News