: బిల్లుపై చర్చకు టీడీపీకి అభ్యంతరం లేదు: యనమల


విభజన బిల్లుపై చర్చించడానికి తెలుగుదేశం పార్టీకి అభ్యంతరం లేదని ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ రోజు శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ, ఈ వివరాలను వెల్లడించారు. అయితే, బిల్లుపై చర్చించడానికి అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమగ్ర సమాచారం లేకుండా బిల్లుపై చర్చించినా ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News