: శాసనసభ ప్రారంభం .. అరగంటపాటు వాయిదా
శాసనసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఇరు ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగి సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో సభను హోరెత్తించారు. ఈ ఆందోళనల మధ్యే తెలంగాణ, సమైక్య ఉద్యమాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై చర్చను కోరుతూ టీడీపీ, సమైక్య తీర్మానం కోరుతూ వైఎస్సార్సీపీ, గ్రామసేవకుల వేతనాలు పెంచాలని కోరుతూ సీపీఎం ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. సభను సజావుగా నిర్వహించడానికి సహకరించాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా సభ్యులు పట్టించుకోకపోవడంతో, సభను అరగంట పాటు వాయిదా వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.