: ఇదో వెరైటీ రికార్డు ప్రకటన
మన చేతికి చాక్‌పీస్ ఇస్తే ఏం చేస్తాం... టీచరైతే చక్కగా దాన్ని రాయడానికి వాడతారు. పిల్లలైతే వాటిని పలకలపై రాయడానికి వాడుకుంటారు. అదే మగువలైతే చక్కగా ముగ్గులు పెట్టడానికి వాడతారు... కానీ అభిషేక్ అయితే అలాంటి చాక్‌పీస్‌లతో చక్కటి ప్రకటన తయారుచేశాడు. తమిళనాడులో ఇంటర్ చదువుతున్న అభిషేక్ రమణ అనే విద్యార్ధి చాక్‌పీస్‌లతో చక్కటి కళాఖండాలను తయారుచేయగలడు. ఇందులో భాగంగా రమణ వేల సంఖ్యలో చాక్‌పీస్‌లతో చక్కటి ప్రకటన తయారుచేసి ప్రపంచ రికార్డు సాధించడానికి ప్రయత్నించాడు. 95 వేల చాక్‌పీస్‌లను నేలపై పేర్చి రమణ ఒక భారీ ప్రకటన తయారుచేశాడు. 'పవన విద్యుదుత్పత్తిని ప్రోత్సహించండి' అనే అక్షరాలను చాక్‌పీస్‌లతో పేర్చి రికార్డు సృష్టించాడు. ఇలా పేర్చడానికి 5వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభించిన రమణ మంగళవారం నాడు సాయంత్రానికి ముగించాడు. సుమారు పది మీటర్ల పొడవు, ఐదు మీటర్ల వెడల్పుతో కూడిన ఈ భారీ ప్రకటనను జనాలు ఆసక్తిగా చూస్తున్నారు. అందుకే పడాల్సిన వారి చేతిలో పడితే ఎలాంటి వస్తువైనా తగు గుర్తింపును పొందుతుంది మరి.