: ముంబయిలోని గ్లోబల్ ఆసుపత్రిలో చేరిన సంజయ్ దత్ సతీమణి
సంజయ్ దత్ సతీమణి మాన్యత ఈ రోజు ముంబయిలోని గ్లోబల్ ఆసుపత్రిలో చేరారు. గత కొంతకాలంగా ఆమె హృదయ, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మాన్యతకు కొన్ని వైద్య పరీక్షలు చేయాల్సి ఉందని, అనంతరం ఆమెకు సర్జరీ చేయాల్సిన అవసరం ఉందా? లేదా? అనే విషయం తెలుస్తుందని, ఆసుపత్రికి చెందిన హృదయ, కాలేయ వైద్య నిపుణుడు డాక్టర్ అజయ్ చఘులే తెలిపారు. కాగా తన సతీమణి ఆరోగ్యం క్షీణించడంతో ముంబయి బాంబు పేలుళ్ల కేసులో పూణేలోని ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్ 30 రోజుల పెరోల్ పై విడుదలయ్యారు.