: ఇప్పుడు నేనేమీ చెప్పను.. అసెంబ్లీలో అన్నీ చెబుతా: సీఎం
మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన సీఎం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాన్ని దాటవేశారు. తానేం చెప్పాలనుకున్నారో అదే చెప్పేసి తప్పించుకున్నారు. బిల్లుపై ఇక్కడ మాట్లాడడం సరికాదని, తాను అసెంబ్లీలోనే మాట్లాడతానని, అప్పుడు మీడియా ప్రతినిధులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని సీఎం అన్నారు. మరో 11 రోజుల సమయమే మిగిలి ఉన్నందున అసెంబ్లీలో అందరూ మాట్లాడుతారని, అప్పుడు అన్నీ తెలుస్తాయని సీఎం కిరణ్ చెప్పారు. 'మీడియా ద్వారా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా..శాసనసభ చర్చలో పాల్గొని ప్రజాభీష్టాన్ని కేంద్రానికి తెలియజేయండి' అని సీఎం కోరారు.