: కాపులను బీసీల్లోకి చేర్చుకోవడాన్ని ఒప్పుకోం: ఆర్.కృష్ణయ్య
కేవలం రాజకీయ లబ్ధికోసమే కొంతమంది నేతలు కాపులను బీసీ కులాల జాబితాలోకి చేర్చే ప్రయత్నం చేస్తామంటున్నారని బీసీ కులాల నాయకుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. వీరి ప్రయత్నాలను తాము తిప్పికొడతామని ఆయన హెచ్చరించారు. కాపులను బీసీల్లో చేరిస్తే... నిజమైన బీసీలకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో రాజ్యాధికారం కోసం బీసీలమందరం పోరాడుతామని చెప్పారు. బీసీలకు రాజకీయాల్లో ఏ పార్టీ ఎక్కువ అవకాశాలు ఇస్తే, వారికి మద్దతు తెలుపుతామని అన్నారు.