: లీకుల మహారాజు సీఎం కిరణ్: దేవినేని ఉమ


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై టీడీపీ నేత దేవినేని ఉమ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి కిరణ్ ఓ లీకుల మహారాజు, మౌన ముని అంటూ విమర్శించారు. టీబిల్లుపై శాసనసభలో స్పీకర్ ఓటింగ్ నిర్వహించి వివిధ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలని... అప్పుడే కిరణ్, జగన్ ల డ్రామాలు బయటపడతాయని అన్నారు. ఈ రోజు ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడారు. జగన్ తన 18 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయించుకుని... ఓదార్పు యాత్ర చేపడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News