: 'క్యునెట్ స్కామ్'లో నటుడు బొమన్ ఇరానీ కుమారుడిపై ఆరోపణలు!


ముంబైలో రూ.425 కోట్ల 'క్యునెట్ స్కామ్' సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కుంభకోణంలో మాజీ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ మైఖేల్ ను పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ స్కామ్ లో బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ కుమారుడు దానేష్ పాత్రపై పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నారు. బహుళస్థాయి మార్కెటింగ్ సంస్థ క్యునెట్ లోని ఓ పథకంలో బొమన్ కొడుకు అధిక మొత్తంలో డబ్బు పొందినట్లు ఓ సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. ఈ మేరకు గతేడాది గురుప్రీత్ సింగ్ ఆనంద్ అనే వ్యక్తి క్యునెట్ సంస్థపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. దాంతో, ఈ రోజు దర్యాప్తు సంస్థ 'ముంబై పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్'ను అతను కలిశాడని, స్కామ్ తో దానేష్ కున్న సంబంధాన్ని పూర్తి వివరాలతో రెండు పేజీలపై రాసి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తన తండ్రితో పాటు కొడుకు దానేష్ క్యునెట్ సంస్థ పథకం గురించి ప్రచారం చేసినట్లు ఫిర్యాదులో సదరు వ్యక్తి ఆరోపించాడని.. అయితే, ఇందులో బొమన్ కు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News